![]() |
![]() |

ఏదైనా ఒక సీరియల్ కొన్ని నెలలు, కానీ సంవత్సరాలు కానీ నడిచినప్పుడు ఆ సీరియల్ కి పని చేసిన అందరి మధ్య అద్భుతమైన బాండింగ్ అనేది ఏర్పడుతుంది. సీరియల్ ఐపోయినా వాళ్ళ స్నేహం అలాగే ఉంటుంది. ఇక సోషల్ మీడియా ఫుల్ ఫేమస్ అయ్యాక ఆ సీరియల్ గ్యాంగ్స్ అన్నీ కూడా రీల్స్, వీడియోస్ చేస్తూ ఆడియన్స్ తో కనెక్ట్ అవుతూనే ఉన్నారు. అలాంటి ఒక సీరియల్ "జానకి కలగనలేదు" పూర్తైపోయినా కూడా ఆ టీమ్ మొత్తం కలిసే తిరుగుతున్నారు. ఈవెంట్స్ ని సెలెబ్రేట్ చేసుకుంటున్నారు. అలాంటి టైంలోనే ‘జానకి కలగనలేదు’ సీరియల్ టీం అందరూ కలిసి శ్రీశైలం వెళ్లారు. ఆ వీడియోను జెస్సి రోల్ నటించిన భవి యూట్యూబ్ ద్వారా షేర్ చేసుకుంది. ఆ వీడియోలో రామ, అఖిల్, జెస్సి, మల్లిక ఇంకా కొంతమంది కూడా సందడి చేస్తూ కనిపించారు.
అందరూ కలిసి శ్రీశైలం ట్రిప్ లో బాగా ఎంజాయ్ చేశారు అనేది వాళ్ళ ఫేస్ లో హ్యాపీనెస్ చూస్తే అర్థమైపోతుంది. కొన్ని పురాతన ఆలయాలను చూపిస్తూ వాటి గురించినే ఇంటరెస్టింగ్ విషయాలను కూడా ఈ వీడియోలో చెప్పారు. అయితే ఆ వీడియోలో జానకి అలియాస్ ప్రియాంక జైన్ , అత్తగారు, మావగారిగా చేసిన జ్ఞానాంబ, గోవిందరాజులు కూడా కనిపించలేదు. ప్రస్తుతం ఆ వీడియో బాగా వైరల్ అయ్యింది.. "పబ్బులకు, బార్లకు వెళ్లాల్సిన టైములో ఈ గుళ్లేమిటండి" అని సిద్దార్ధ సరదా సెటైర్ వేసాడు. అలా శ్రీశైలం ట్రిప్ కి వెళ్లి రిటర్న్ లో సాక్షి గణపతి స్వామి ఆలయానికి వెళ్లి వచ్చారు. ఇక వాళ్ళు స్టే చేసిన కాటేజ్ చూపించారు...వాళ్ళ కార్లకు పూజలు కూడా చేయించుకున్నారు. అమరదీప్ కాసేపు భవికి డాన్స్ కూడా నేర్పించాడు. ఇక ఈ టీమ్ మొత్తం సోషల్ మీడియాలో సరదాగా వీడియోలు చేస్తూ ఉంటారు. కాస్త బ్రేక్ దొరికితే చాలు ఫన్నీ ఫన్నీ వీడియోస్ చేస్తుంటారు వీళ్ళు.
![]() |
![]() |